Header Banner

హైఅలర్ట్.. స్టేషన్‌లో సోదాలు.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో భద్రత కట్టుదిట్టం..

  Fri May 09, 2025 11:00        Politics

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి ప్రత్యేక మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ జేవీ రమణ, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి పర్యవేక్షణలో ఈ మాక్‌డ్రిల్‌ జరిగింది. రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్‌లతో కూడిన ఐదు ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాలుపంచుకున్నాయి. రైల్వేస్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫాంలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టికెట్‌ కౌంటర్లు, బుకింగ్‌ కార్యాలయాలు, పార్శిల్ విభాగం వంటి ప్రదేశాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. అలాగే, స్టేషన్ వెలుపల రద్దీగా ఉండే పూల మార్కెట్, డీజిల్ లోకో షెడ్ వంటి ప్రాంతాల్లోనూ సిబ్బంది బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను నమోదు చేసుకున్నారు. స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాల పనితీరును అధికారులు సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ఫుటేజీని నిశితంగా పరిశీలించాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మాక్‌డ్రిల్‌ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు, ప్రయాణికులకు భద్రతపై భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations